తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల్లో అస్థిరత ఏర్పడి దక్షిణంవైపుగా వీస్తున్నట్టు తెలిపింది. బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద నిన్న అల్పపీడనం ఏర్పడగా, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాగా, గత మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పీవీ సింధుకు ఘన సత్కారం