Monday, November 18, 2024

Rains – త‌మిళ‌నాడులో కుమ్మే స్తున్న వర్షాలు..

పుదుచ్చేరి, కేర‌ళ‌లో సైతం వ‌ర్షం
చెన్నైలో మాత్రం ఎండ‌లే
ఐపిఎల్ మ్యాచ్ కు త‌ప్పిన వ‌రుణ గండం

త‌మిళ‌నాడు రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులు సైతం పూర్తిగా నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే
గురువారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. నేడు కురిసిన భారీ వర్షానికి తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర ప్రాంతాల్లో మాత్రం రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇది ఇలా ఉంటే నేటి నుంచి జ‌ర‌గ‌నున్న ఐపిఎల్ మ్యాచ్ ల‌కు వేదిక‌గా ఉన్న చెపాక్ లో వ‌ర్షం ప‌డేఅవ‌కాశం లేద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.. ఇక రాబోయే ఐదు రోజుల పాటు రాయలసీమ, కేరళలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement