Saturday, October 5, 2024

TG | మరో మూడు రోజులపాటు వర్షాలు… పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రానున్న మూడు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే ఛాన్స్‌ ఉందని చెప్పింది. సోమవారం ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రస్తుతం రాష్ట్రంలో రెండు రోజులుగా ఎండ వేడి భారీగా పెరిగిపోయింది. దీంతో పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షాలు మాత్రం ఒకటి, రెండు చోట్లనే కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement