తెలంగాణలో రానున్న మూడు రోజుపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హైదరాబాద్ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
అదేవిధంగా ఏపీలోని ఉత్తర కోస్తా, యానాంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.