ఏపీకి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఆగ్నేయం దిశగా కొనసాగుతుండగా.. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ క్రమంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, పీఏ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.