Friday, November 22, 2024

Rains | మరో మూడు రోజులు వానలే వానలు.. పలు జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం దక్షిణ ఒడిశా పరిసరాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1కిమీ ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.

ఈ నెల 24న బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రా దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 4రోజులు ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. ఈ నెల మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ , జనగామ, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ ను జారీ చేసింది.

- Advertisement -

26, 27 తేదీల్లో అతి భారీ వర్షాలు…

ఇక 26న బుధవారం నుంచి గురువారం వరకు కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హ న్మకొండ, జనగామ, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ను జారీ చేసింది.

ఈ నెల 26 నుంచి 27 వరకు మం చిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంగ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.అదే సమయంలో పలు జిల్లాల్లో ఈ రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement