దేశంలోని అనేక ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని.. ఢిల్లీలో ఈదురు గాలులతోపాటు రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే చాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 19డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
అంతేకాకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గిపోతాయని, మంగళవారం నాటికి 8 డిగ్రీల కంటే తగ్గొచ్చని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. కాగా, బుధవారం ఉష్ణోగ్రతల తగ్గుదలతో పాటు.. ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించారు.