Friday, November 22, 2024

నెద‌ర్లాండ్స్‌లో రైనా రెస్టారెంట్‌.. ఇండియ‌న్ ఫుడ్‌కి కేరాఫ్‌గా అంటున్న మాజీ క్రికెట‌ర్‌

దూకుడు, వినూత్న బ్యాటింగ్ శైలికి పేరుగాంచిన సురేష్ రైనా ఈసారి విభిన్నమైన పాత్రలో కనిపించాడు. 36 ఏళ్ల ఈ యంగ్‌మ‌న్‌ నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో తన సొంత రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. రెస్టారెంట్ కి సంబందించి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టాడు. నార్త్‌ ఇండియా నుండి సౌత్ ఇండియా వ‌ర‌కు అన్ని భారతీయ రుచులను ఈ రెస్టారెంట్ లో అందించ‌నున్న‌ట్టు పేర్కొన్నాడు.

రైనా ఇండియన్ రెస్టారెంట్‌లో ప్రతిభావంతులైన చెఫ్‌లు ఉండ‌టంతో.. అస‌లుసిస‌లైన‌ భారతీయ ఆహారాన్ని రెస్టారెంట్ కి వ‌చ్చినవారు ఆస్వాదించవచ్చు. నార్త్. సౌత్, ఈస్ట్, వెస్ట్ నుండి భారతదేశంలోని విభిన్న వంటకాల రుచికరమైన కలగలుపుకుని ఒక మెనూ తయారు చేసిన‌ట్టు కూడా వెల్ల‌డించాడు. ఇది అద్భుతమైన భోజన అనుభవాన్ని అందిస్తుంది అని తెలిపాడు రైనా.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement