Saturday, September 21, 2024

HYD | నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం !!

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. సిటీలో ఉదయం నుంచి వాతావరణం వేడిగా ఉండగా… రాత్రి సమయానికి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిస్తొంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ఇక రాత్రి సమయంలో ఇళ్లకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కాగా, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడల, నాగోల్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్‌, అంబర్‌పేట్‌, రామంతపూర్‌, గోల్నాక, నారాయణగూడ, రామంతాపూర్, ముషీరాబాద్, రాజేంద్ర నగర్, మలక్‌పేట, చంపాపేట, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, బాలానగర్, జీడీమెట్ల, షాపూర్ నగర్, సూరారం, సుచిత్ర, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, నాంపల్లి, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీ నగర్, అడిక్ మెట్, జవహర్ నగర్, కవాడిగూడ, దోమల్ గూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభిచడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement