Friday, November 22, 2024

TG | హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపుల‌తో వ‌ర్షం..

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. సాయంత్రం నుంచి మేఘావృతమై, కొద్దిసేప‌టి నుంచి ప‌లు చోట్ల వర్షం కురుస్తొంది. ఇక నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే అంచనా వేసింది. ఐఎండీ ప్రకటించిన కొన్ని గంటలకే హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

న‌గ‌రంలోని ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, జోన్‌లో సాయంత్రం నుంచి వ‌ర్షం కురవ‌డం ప్రారంభ‌మైంది. ఇక దమ్మాయిగూడ, కాప్రా, ఏఎస్ రావ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోందని స్థానికులు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందనున్నారు.

ఇక ఈ నెల జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు వీలైనంత త్వరగా వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉండటంతో ఇదివరకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement