Sunday, November 24, 2024

RCB vs CSK | బెంగళూరులో బౌండరీల మోత‌.. కీలక మ్యాచ్‌లో రాణించిన ఆర్సీబీ బ్యాటర్లు

ప్లేఆఫ్స్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు రాణించారు. హోం గ్రౌండ్ వేదికగా సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ స్కోర్ బాదింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు సాధించింది.

ఓపెన‌ర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ జట్టుకు శుభారంభ‌మిచ్చారు. ఫాప్ (39 బంతుల్లో 54)తో హాఫ్ సెంచరీ బాదాడు. మరోవైపు బౌండరీలతో విజృంభించిన కోహ్లీ ( 29 బంతుల్లో 47), పాటీదర్ (23 బంతుల్లో 41) తృటిలో అర్థ సెంచరీ మిస్ చేసుకున్నారు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన కెమెరూన్ గ్రీన్ సైతం (17 బంతుల్లో 38 నాటౌట్) సిక్స్ లు, ఫోర్లతో చెలరేగాడు. ఆఖ‌ర్లో దినేష్ కార్తీక్ (6 బంతుల్లో 14) , మాక్స్‌వెల్ (5 బంతుల్లో 16) మెరుపులు మెరిపించి ఔట‌య్యారు. దీంతో కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ రాణించడంతో భారీ స్కోరు నమోదు చేశారు.

ఇక చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయ‌గా.. తుషార్ దేశ్‌పాండే, మిచెల్ సాంట్నర్ చెరో వికెట్ ద‌క్కించుకున్నారు. కాగా, 219 ప‌రుగుల టార్గెట్‌తో చెన్నై జట్టు ఛేజింగ్‌కు దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement