తెలంగాణలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. అలాగే, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. దక్షిణ ఒడిశా తీరంలో 3.1-7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.కాగా, కొన్ని రోజులుగా తెలంగాణలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఇది కూడా చదవండి: విమర్శకుల నోటికి సిరాజ్ తాళం..