తెలంగాణలో రుతుపవనాలు కదలికలు చురుగ్గా ఉండటంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కూడా రాష్ట్రవాప్తంగా వర్షాలు పడ్డాయి. కుమురంభీం జిల్లా సిర్పూరులో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులు అస్థిరంగా కదులుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: ఆ స్టార్ హోటల్ లో 3 వేలకు చిన్న రొట్టెముక్క పెట్టారు..