Tuesday, November 26, 2024

తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలు..

తెలంగాణలో రాబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కొత్తగూడెం, హైదరాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, ములుగు, నల్లగొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు చోట్ల వానలు పడే అవకాశం ఉన్నదిన పేర్కొన్నది. ఉత్తర ఇంటీ‌రి‌యర్‌ కర్ణా‌ట‌కలో ఏర్పడిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్లతో వర్షం కురుస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమ‌వారం రాష్ట్రంలో ఉరు‌ములు, మెరు‌పు‌లతో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురి‌సింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement