తెలంగాణలో రాబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ రూరల్, అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు చోట్ల వానలు పడే అవకాశం ఉన్నదిన పేర్కొన్నది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్లతో వర్షం కురుస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది.
తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలు..
- Tags
- breaking news telugu
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- rain
- telangana
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
- Weather report
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement