Friday, November 22, 2024

అలర్ట్: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి రాగల మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి, ఈ రోజు బలహీన పడింది. తూర్పు – పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు సుమారు 17°N అక్షాంశం వెంబడి స్థిరంగా ఉండి, సముద్ర మట్టానికి 4.5 కిమీ నుండి 5.8 కిమీ మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉంది. దీంతో ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జులై 23న వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అటు హైదరాబాద్‌ లో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement