Monday, November 18, 2024

తెలంగాణలో రాగల 3 రోజుల పాటు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటలలో నైరుతి రుతపవనాలు దక్షిణ అండమాన్ సముద్రము, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఎల్లుండి (22వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని… ఈ అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవాశముందని పేర్కొంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా-పశ్చిమ బెంగాల్ తీరానికి 26వ తేదీ ఉదయం చేరుకొనే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు (20,21,22వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement