Wednesday, November 20, 2024

రాగల మూడు రోజులు తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు…

తెలంగాణలో రాగల మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర – దక్షిణ ఉపరితల ద్రోణి నైరుతి మధ్య ప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల నుండి మరత్వడ, దక్షిణ మధ్య మహారాష్ట్ర మరియు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదగా కర్ణాటక తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి మి వరకు ఏర్పడినది. దీంతో రాగల 3 రోజులు (09,10,11వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కురుస్తాయని. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40కి మి) మరియు వడగండ్లతో(ముఖ్యముగా ఉత్తర, పశ్చిమ తెలంగాణా జిల్లాలలో) మరియు ఎల్లుండి (11వ తేదీ) ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40కి మి)తో ఒకటి,రెండు ప్రదేశములలో వచ్చే అవకాశము ఉందని వాతావరణం శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement