తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాల్లో కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని…అలాగే.. రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రదేశాలలో పడే అవకాశాలు వున్నాయిని తెలిపింది. తూర్పు-పడమర షీర్ జోన్ ఇప్పుడు 3.1 కిమీ, 5.8 కిమీ మధ్య lat 15 ° N సముద్ర మట్టం ఎత్తుతో దక్షిణ దిశకు వంగి ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ… మరాఠ్వాడ & పరిసరాలపై ఉపరితల అవర్తనం ఇప్పుడు ఉత్తర మధ్య మహారాష్ట్ర & పరిసరాలపై, సగటు సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది.
ఇది కూడా చదవండి: మరోసారి దాయాదుల పోరుకు సిద్దంకండి..