Tuesday, November 19, 2024

TS | తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షం.. రైతుల్లో ఆందోళన !

తెలంగాణలో గత వారం రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. దీంతో, చలికాలానికి కాలం వెల్లిపోయి.. ఎండకాలం మొదలైందని అంతా ఉసూరుమన్నారు. అయితే.. ఇప్పుడు వెరైటీగా.. చలి, ఎండకాలాల మధ్యలో అకాల వర్షాలు ఎంట్రీ ఇచ్చాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురిసిన ఈ వర్షాలతో రైతులు బెంబేలెత్తి పోతున్నారు. ముఖ్యంగా.. నిర్మల్ జిల్లాలోని భైంసాలో అకాల వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం పూట.. తానూర్, ముధోల్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షంతో.. ఆ ప్రాంతంలోని రైతుల్లో ఆందోళన నెలకొంది.

ఆరు గాలం శ్రమించి పండించిన పంట.. చేతికొచ్చే సమయంలో ఇలా అకాల వర్షం కురవడంతో తమ కష్టమంతా నీటిపాలవుతుందా ఏంటీ అని రైతుల ఆందోళన చెందుతున్నారు. వర్షంతో పలుచోట్ల వరి పైర్లు నేలకు ఒరిగాయి. అయితే.. రెండు మూడు రోజులుగా ఉదయం పూట ఎండలు మండుతుంటే.. సాయంత్రం కాగానే ఈదురు గాలులు వస్తుండటంతో.. అన్నదాతలు టెన్షన్ పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement