Saturday, November 23, 2024

వీడియో: వర్షాలకు కొట్టుకుపోయిన కార్లు..

చైనాలో గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి..ఈ భారీ వ‌ర్షాల‌కు న‌దులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా పెద్ద ఎత్తున వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. హెన‌న్ ప్రావిన్స్ లో గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా వ‌ర్షాలు కురిశాయి.  హెన‌న్ ప్రావిన్స్‌లోని జెంగ్జౌ న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ న‌గ‌రంలో మంగ‌ళ‌వారం రోజున 457.5 మీ.మీ వర్షం కురిసింది. గ‌త వెయ్యి సంవ‌త్సరాల కాలంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థాయిలో వ‌ర్షం కుర‌వ‌లేద‌ని అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది. ఈ భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌గ‌రంలో భారీ వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. ఈ వ‌ర‌ద‌ల్లో వంద‌లాది కార్లు కొట్టుకుపోయాయి.  లోక‌ల్ రైళ్లోకి నీరు చేరడంతో ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డ్డారు. ఎటు చూసినా వ‌ర‌ద నీరే క‌నిపించ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రో కొన్నిరోజులపాటు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement