న్యూఢిల్లీ – దేశరాజధాని హస్తినలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నేటి తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాలతో పాటు హరియాణాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. నిన్నటివరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ఢిల్లీ ఈ వర్షానికి కాస్త చల్లబడింది. కాగా, భారీ వర్షం కారణంగా ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా, మే 30వ తేదీ వరకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement