Friday, November 22, 2024

మూడు రోజులపాటు వర్ష సూచన.. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రానున్న మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు ఈదురుగాలు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు వాతావరణ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగ్నేయం, తూర్పు దిశల నుంచి తెలంగాణ దిశగా గాలులు వీస్తున్నాయని, వీ టి ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర-పశ్చిమ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆమె తెలిపారు. 16న కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబ ద్‌ జిల్లాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది.

17న కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పలో చోట్ల గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18న నల్గొండ, మహబూబాబాద్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్‌, హన్మకొండ, వరంగల్‌, వికారాబాద్‌, సిరిసిల్ల, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

- Advertisement -

కాగా… రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 37.8 డిగ్రీలు, హన్మకొండలో 35.5, ఖమ్మంలో 36.2, నిజామాబాద్‌, రామగుండం, మెదక్‌లలో 35 డిగ్రీలు, భద్రాచలంలో 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా… మంగళవారం వరకు భద్రాద్రికొత్తగూడెం, రామగుండం తదితర ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement