తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వాటి ప్రభావంతో రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఉన్నట్టు పేర్కొంది.
ఇక రాష్ట్రంలో మొన్న ఉదయం నుంచి నిన్న ఉదయం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిన్న ఖమ్మంలోని పలు ప్రాంతాలు భారీగా వర్షపాతం నమోదవగా.. సంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, తదితర జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి.