హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మంగళవారం ఉదయం వరకు కొమరంబీం ఆసీఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు పడతాయని వివరించింది. సోమవారం ఆదిలాబాద్, కుమరంభీం ఆసీఫాబాద్, ములుగు, మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపారు. నగరంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొన్నారు.