Friday, November 22, 2024

బీ అలర్ట్ : మరో రెండు రోజులు భారీ వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండ్రోజులుపాటు తేలికపాటి నుంచి భారీ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ, రేపు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. కాగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, తార్నాక,ఉప్పల్, హబ్సిగూడ, రామంతపూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, విద్యానగర్, అంబర్‌పేట్, రాంనగర్, దోమలగూడ, చిలకలగూడ, అల్వాల్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌తోపాటు చార్మీనార్‌లో భారీగా వాన కురిసింది. అత్యధికంగా బహదూర్‌పురాలో 9 సెంటీమీటర్లు, చార్మినార్‌లో ఐదున్నర సెంటీమీటర్లు, సైదాబాద్‌లో 4 సెంటీమీటర్లు, ఝాన్సీబజార్‌లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సింగరేణి కాలనీ కృష్ణానగర్ నీట మునిగింది. సైదాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ.

ఇది కూడా చదవండి: సొంతగడ్డపై టీమిండియా బిజీ బిజీ.. మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement