Sunday, November 3, 2024

RAIN ALERT : తెలంగాణ‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌.. రెడ్ అలెర్ట్ జారీ..

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో నిన్న సాయంత్రం ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటల్లో కుండపోత వాన కురుస్తుందని పేర్కొంది. వర్షాలు పడుతున్న సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వివరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement