రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రానున్న 48 గంటల్లో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. తెలంగాణలో జోరు వానలు, కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణ అధికారులు సూచించారు.
మరోవైపు అల్పపీడన ప్రభావంతో ఒడిశాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశాల్లోని 5 జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోరాపుట్, మల్కాన్గిరి, కియోంజర్, నబ్రంగ్పుర్, మయూర్భంజ్ జిల్లాలలో కుంభవృష్టి వానలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఈ వార్త కూడా చదవండి: టర్కీని ముంచెత్తిన వరదలు..77 మంది మృతి