భారత్ లో చాలా మంది రైళ్లో ప్రయాణించేందుకు ఇష్టపడతారు. ఎలాంటి రిస్క్ లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడంతోపాటు సమయం ఆదా అవుతుంది. రైళ్లో ప్రయాణం సురక్షితమని ప్రయాణికుల అభిప్రాయం. పండుగల సమయంలో ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంది. ఆయా రూట్లను బట్టి రైళ్ల సంఖ్యను పంచేందుకు నిర్ణయం తీసుకుంటుంది. ఇంతలా మంచి సౌకర్యాలు అందుటుండడంతో ప్రయాణికులు కూడా పండుగ సమయంలో రైళ్లనే ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం దీపావళి పండుగ దగ్గరపడుతుండడంతో విద్యార్థులకు సెలవులు రానున్నాయి. దీనికి తోడు కార్యాలయాలకు కూడా రెండు నుంచి మూడు రోజులు సెలవులు రానుండడంతో వీరంతా ఇళ్లకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈసమయంలో రైల్వే శాఖ సైతం పలు రూట్లలో ప్రయాణికుల సౌకర్యార్ధం దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతుంది. దీపావళి పండుగ నేపథ్యంలో పండగపూట ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు కొన్ని వస్తువులను నిషేధించారు. రైళ్లలో పెట్రోల్, డీజిల్, ఫైర్‌వర్స్క్, గ్యాస్, ఓవెన్, సిగరెట్లు వంటి ప్రమాదకర వస్తువులను ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లేందుకు అనుమతించట్లేదు. నిబంధనలకు విరుద్ధంగా రైలు ప్రయాణంలో నిషేధిత వస్తువులను తీసుకెళ్తే నేరం చేసినట్లే లెక్క. ఎవరైనా పైన పేర్కొన్న నిషేధిత వస్తువులను తీసుకెళ్తున్నట్లు తేలితే.. రైల్వే చట్టంలోని సెక్షన్ 164, 165 ప్రకారం ఆ ప్రయాణికుడిపై అధికారులు చర్యలు తీసుకుంటారు. రూ.1000 జరిమానాతోపాటు, మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement