Tuesday, November 12, 2024

Railway | వేసవి రద్దీ నేపథ్యంలో మరికొన్ని మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో మరిన్ని మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్‌ -ముజఫరాబాద్‌, ముజఫరాబాద్‌ – సికింద్రాబాద్‌, గోరక్‌పూర్‌-మహబూబ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ – గోరక్‌పూర్‌, కొచ్చువెలి-షాలిమార్‌, షాలిమార్‌-కొచ్చువెలి, బెంగళూరు-ఖరగ్‌పూర్‌, భువనేశ్వర్‌-యెహలంక, హుబ్బళ్లి-గోమతినగర్‌, తిన్‌సుకియా-బెంగళూరు, జబల్‌పూర్‌-కన్యాకుమారితో పాటు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది.

ముజఫరాబాద్‌-సికింద్రాబాద్‌ (05293) మధ్య మంగళవారం ఈ నెల 23 నుంచి జూన్‌ 25 వరకు పది ట్రిప్పులు నడుస్తాయని పేర్కొంది. సికింద్రాబాద్‌-ముజఫరాబాద్‌ (05294) ప్రతి గురువారం ఈ నెల 25 నుంచి జూన్‌ 27 వరకు అందుబాటు-లో ఉంటాయని తెలిపింది. గోరక్‌పూర్‌-మహబూబ్‌నగర్‌ (05303) మధ్య ఈ నెల 20 నుంచి జూన్‌ 29 వరకు ప్రతీ శనివారం రైలు నడవనుందని పేర్కొంది. మహబూబ్‌నగర్‌-గోరక్‌పూర్‌ (05304) మధ్య ఈ నెల 22 నుంచి జులై ఒకటి వరకు ప్రతీ సోమవారం రైలు అందుబాటులో ఉంటుందని వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement