సెంట్రల్ రైల్వే ‘రిక్రూట్‌మెంట్ సెల్’ మొత్తం 2,424 ఖాళీల భర్తీకి (మంగళవారం) దరఖాస్తులను ఆహ్వానించింది. వివిధ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 15లోగా అధికారిక వెబ్‌సైట్ rrccr.comలో దరఖాస్తును సమర్పించాలని పేర్కొంది.
10వ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదనంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ ద్వారా గుర్తింపు పొందిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు సడలింపు ఇస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కాగా అభ్యర్థులు మ్యాథ్స్, ఐటీఐలో సాధించిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్టును తయారు చేస్తారు. షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులను సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. కాగా మరింత సమాచారం కావాలనుకున్న అభ్యర్థులు సెంట్రల్ రైల్వేస్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.