Saturday, November 23, 2024

శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్..

వేసవిలో తిరుపతి వెళ్లేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి తిరుపతికి ప్రత్యేక ట్రైన్లు నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ మధ్య ఈ ప్రత్యేక ట్రైన్లు నడిపించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. కాచిగూడ-తిరుపతి (ట్రైన్ నెంబర్ 07653)కి ఏప్రిల్‌ 11, 18, 25 మే 2 తేదీల్లో.. తిరుపతి-కాచిగూడ (ట్రైన్ నెంబర్ 07654)కి ఏప్రిల్‌ 12, 19, 26, మే 3 తేదీల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్‌, గద్వాల స్టేషన్లలో ఈ ట్రైన్లు ఆగుతాయని వెల్లడించారు.

- Advertisement -

ఇక సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ (ట్రైన్ నెంబర్ 07170) ఏప్రిల్‌ 13, 20, 27 తేదీల్లో, నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ (ట్రైన్ నెంబర్ 07169) ఏప్రిల్‌ 14, 21, 28 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులు ఉపయోగించుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement