ఈ మధ్య రైల్వే ప్లాట్‌ఫామ్ పైనుంచి ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిన ఓ చిన్నారిని రైల్వే ఉద్యోగి కాపాడిన సంగతి అందరికి తెలిసిందే. చిన్నారి ని కాపాడిన మయూర్ షెల్కె అనే ఆ రైల్వే ఉద్యోగి ఒక్కసారిగా నేషనల్ హీరో అయిపోయాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఆ వీడియో వైరల్ అయింది. తాజాగా జావా మోటార్‌సైకిల్స్ కోఫౌండర్ అనుపమ్ తరేజా అతనికి ఖరీదైన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ముందుగా మాట ఇచ్చినట్లే మయూర్‌కు బైక్ ఇచ్చినట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. జావా ఫార్టీ oటూ బైక్‌ను మయూర్ అందుకున్నాడు. నెబ్యులా బ్లూ కలర్లో ఉన్న ఈ బైక్ ధర రూ.లక్షన్నరకు పైనే కావడం విశేషం.
Advertisement
తాజా వార్తలు
Advertisement