తెలంగాణకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని దశాబ్ధాల నాటి డిమాండ్.. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా వరంగల్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై పెటట్టుకున్న ఆశలు త్వరలోనే నెరవేనున్నాయి. రాష్ట్ర విభజన హామీలలో మరో హామీని కేంద్రం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది.
ఖాజీపేటలో రైల్వే తయారీ యూనిట్(ఆర్ఎంయు) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాజీపేటలోని ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు రైల్వే బోర్డు లేఖ రాసింది.