Friday, November 22, 2024

Rails Export – విదేశాల‌కూ వందే భార‌త్‌

భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఆదరణ లభిస్తోంది. అత్యంత వేగంతో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లు దేశంలో మొత్తం 82 నడుస్తున్నాయి. అత్యంత టెక్నాలజీకి తయారైన ఈ రైళ్లకు ఇతర దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రయాణికులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. హైస్పీడ్‌, అద్భుతమైన సౌకర్యాలతో కూడిన ఈ రైలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా క్రేజీగా ఉంది. ఈ సెమీ హైస్పీడ్ రైలును ఎగుమతి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కొనుగోలు గురించి చాలా దేశాలు ఆరా తీశాయని, రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారత్‌ ఈ అద్భుతమైన రైళ్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని అన్నారు.

వందే భారత్ రైలు భాగాలను స్వదేశీ డిజైన్, సామర్థ్యంతో తయారు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ యూనిట్లతో పాటు దాని సొంత వర్క్‌షాప్‌లను ప్రారంభించింది. దేశంలో మన ఇంజనీర్ల సహకారంతో వందేభారత్ రైళ్ల‌ను నిర్మించడం పెద్ద సవాలుగా మారింది. ప్ర‌స్తుతం ఈ సవాలును అధిగమించి, రానున్న కొద్ది సంవత్సరాల్లో వందే భారత్ రైళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయగలదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

దేశంలో 82 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

ప్రస్తుతం దేశంలో 82 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్ల వేగాన్ని కూడా పెంచే పనులు కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి తెలిపారు. న్యూఢిల్లీ-ముంబై, న్యూఢిల్లీ-హౌరా మార్గాల్లో వందేభారత్ రైళ్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు ట్రై చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

రోజూ 15 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌ను నిర్మిస్తున్నాం

- Advertisement -

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం ఊపందుకున్నదని అశ్విని వైష్ణవ్ అన్నారు. 2004 నుంచి 2014 వరకు రోజుకు సగటున నాలుగు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ను నిర్మిస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడు రోజూ 15 కిలోమీటర్ల మేర ట్రాక్‌లు వేస్తున్నారు. గత పదేళ్లలో 41 వేల కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను విద్యుదీకరించారు. 2004 నుంచి 2014 వరకు రైల్వేలో పెట్టుబడులు రూ.15,674 వేల కోట్లుగా ఉన్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement