తులి – కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ గురువారం నాగాలాండ్ నుంచి శివసాగర్ జిల్లాలోని హలువాటింగ్ మీదుగా అస్సాంలోకి ప్రవేశించింది. రాహుల్ గురువారం ఉదయం నాగాలాండ్‌లోని తులి నుండి బస్సులో తన ప్రయాణాన్ని పునఃప్రారంభించి, ఉదయం 9:45 గంటలకు అస్సాం చేరుకున్నారు. రాష్ట్రంలో ఎనిమిది రోజుల యాత్ర కోసం అస్సాం కాంగ్రెస్ నాయకులకు జాతీయ జెండాను అందచేశారు. హలువాటింగ్ వద్ద వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.
రాహుల్ నేతృత్వంలోని 6,713 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమై మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. కాగా, అస్సాంలో ఈ పాదయాత్ర జనవరి 25 వరకు కొనసాగుతుంది. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలను కవర్ చేయడానికి ప్లాన్ చేశారు.