Friday, January 10, 2025

Delhi | రాహుల్‌ గాంధీ.. కోల్డ్‌ కాఫీ !

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఇటీవల ఢిల్లిలోని కెవెంటర్స్‌ స్టోర్‌ను సందర్శించారు. అక్కడి ప్రజలతో కలిసి కోల్డ్‌ కాఫీ తాగారు. స్టోర్‌ వ్యవస్థాపకులతో ముచ్చటించారు. భవిష్యత్‌ ప్రణాళికలు, సవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కెవెంటర్స్‌ వంటి ప్లేఫెయిర్‌ వ్యాపారాలు మనదేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి.

ఇలాంటివి మరిన్ని తీసుకురావాలి.. కొత్త వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వండి అని ఎక్స్‌లో రాహుల్‌ పోస్టు చేశారు. తాను స్టోర్‌ను సందర్శించినప్పటి వీడియోను పంచుకున్నారు. కోల్డ్‌ కాఫీ ఎలా తయారు చేస్తారో చూడాలని అనుకుంటున్నారా అని అక్కడి సిబ్బంది రాహుల్‌ను అడగ్గా, లేదు.. నేనే తయారుచేస్తా అంటూ చేతికి గ్లౌజ్‌లు తొడుక్కుని స్వయంగా కోల్డ్‌కాఫీ తయారు చేశారు.

కెవెంటర్స్‌ సహ వ్యవస్థాపకులు అమన్‌ అరోరా, అగస్త్య దాల్మియాతో వ్యాపారం గురించి రాహుల్‌ ఆరాతీశారు. టైర్‌ 2, టైర్‌ 3, టైర్‌ 4 నగరాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, టైర్‌ 1 నగరాల్లో అద్దెలు సవాలుగా మారుతున్నాయని వారు వివరించారు. ప్రస్తుతం 65నగరాల్లో 200 స్టోర్లు ఉన్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement