న్యూఢిల్లి: 12 తుగ్లక్ లేన్ అధికారిక బంగళాను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఖాళీ చేశారు. బంగళాలో ఆయనకు చెందిన సామాగ్రితో కూడిన ట్రక్కులు రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీకి చెందిన 10 జనపథ్ నివాసానికి బయలుదేరి వెళ్ళాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే రాహుల్ గాంధీ శాశ్వతంగా సోనియా గాంధీ నివాసానికి తరలిపోవడంపై ఇంకా ఒక స్పష్టత రాలేదని వెల్లడించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం కోసం మరో ఇంటిని వెదుకుతున్నారని తెలిపాయి. రాహుల్ గాంధీ జెడ్ ప్లస్ భద్రతలో ఉన్నారు కనుక భద్రతా ఏజెన్సీల నుంచి ఆమోదం పొందిన అనంతరం కార్యాలయానికి అవసరమైన ఇల్లు ఖరారవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు ఆయనపై 2019లో నమోదైన ఒక పరువు నష్టం దావాలో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి శిక్ష విధించడంతో లోక్‌సభ ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేసిన లోక్‌సభ సెక్రటేరియట్.. ప్రభుత్వం కేటాయించిన అధికారిక బంగళాను ఖాళీ చేయాలంటూ మార్చి 27న ఆయనకు నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 12 తుగ్లక్ లేన్ అధికారిక బంగళాను రాహుల్ గాంధీ శుక్రవారం ఖాళీ చేశారు.
అమ్మ ఇంటికి రాహుల్….
Advertisement
తాజా వార్తలు
Advertisement