న్యూ ఢిల్లీ: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దిగువ కోర్టులు పత్రాల సంఖ్య చూశాయేగానీ సరైన కారణాలు చూపలేదని వ్యాఖ్యానించింది. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ సుప్రీంను ఆశ్రయించారు.. దీనిపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.. తాను ఏ తప్పు చేయలేదని, ఈ కేసులో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని రాహుల్ కోర్టులో అఫిడియేట్ ను దాఖలు చేశారు.. అలాగే ఈ కేసు దాఖలు చేసిన వ్యక్తి బిజెపికి చెందిన వాడంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు రాహుల్..
అలాగే , నేటి వాదనలలో రాహుల్ తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదన కొనసాగిస్తూ, రాహుల్ ఏ తప్పు చేయలేదని, ఈ సూరత్ తీర్పును కొట్టివేయాలని వాదించారు.. డిఫెన్స్ వాదనలు కూడా విన్న సుప్రీం కోర్టు తీర్పు పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించింది..