పాట్నా – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఈ నెల 25న భౌతికంగా హాజరుకావాలని రాహుల్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో హాజరుపై మినహాయింపును ఇవ్వాలని రాహుల్ తరఫున న్యాయవాదులు పాట్నా హైకోర్టులో అప్పీల్ చేయగా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఇచ్చిన ఆదేశాలపై మే 15వ తేదీ వరకు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఈ నెల 12న రాహుల్ గాంధీ కోర్టులో హాజరుకావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. అనంతరం రాహుల్ తరఫున న్యాయవాది హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు. మరోవైపు, న్యాయవాది ఎస్‌డీ సంజయ్ రాహుల్ బెయిల్‌ను రద్దు చేయాలని, తద్వారా ఆయనను కోర్టులో హాజరుపరిచేలా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. ఈ క్రమంలో 25న భౌతికంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ హైకోర్టును ఆశ్రయించగా స్టేను విధించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement