భారత్ జోడో యాత్రలో ఇవ్వాల ఓ అపురూప సన్నివేశం కనిపించింది. అన్నా చెల్లెలు అయిన రాహుల్ గాంధీ, ప్రియాంక ఇద్దరు భారత్ జోడో వేదికపై ఓ మధురక్షణాన్ని పంచుకున్నారు. రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను దగ్గరకు లాక్కొని, ఆమె బుగ్గలపై ముద్దుపెట్టుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి ఆప్యాయత, అనురాగాన్ని తెలిపే ఈ సన్నివేశానికి సంబంధించిన ఫొటో ఒకటి కెమెరాకి చిక్కింది. ప్రియాంకని తన సోదరుడు బహిరంగంగా ఆప్యాయతను ప్రదర్శించడంపై కొంచెం ఇబ్బందిగా కనిపించారు.. అందరూ చూస్తుండగానే రాహుల్ తన చెల్లిలి చెక్కిలిపై కిస్ చేయడంతో ప్రియాంక నవ్వు ఆపుకోలేకపోయింది.
ఇక.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ భారత్ జోడో యాత్రతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల నాటికి పార్టీని మళ్లీ ఉత్సాహ పరిచే లక్ష్యంతో కార్యక్రమం చేపట్టారు. ఈ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ నెలాఖరులో జమ్మూ కాశ్మీర్‌లో చివరి దశకు చేరుకోనుంది.