Wednesday, November 20, 2024

పెగాసస్‌ రచ్చ..రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రతిపక్ష పార్టీల లేఖ..

మన దేశంలో ప్రకపంనలు సృష్టించిన పెగాసస్‌ హ్యాకింగ్‌ ఇష్యూపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.. పార్లమెంట్ ఉభయసభలలో ఈ అంశంపై చర్చించాలని ప్రతిక్షాలు ప్రతిరోజు డిమాండ్ చేస్తున్నాయి. పెగాస‌స్ పై చ‌ర్చించాల‌ని కొన్ని రోజులుగా విప‌క్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం అందుకు ఒప్పుకోవ‌ట్లేదు. దీంతో ఉభ‌య స‌భ‌ల్లో విప‌క్ష నేత‌లు ఆందోళ‌న‌ల‌కు దిగుతుండ‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంటోంది. వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. తాజాగా పెగసస్ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కూడా లేఖ రాశాయి.

ఇక మరోపక్క, ఈ రోజు లోక్‌స‌భ‌లో పెగాసస్ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు విప‌క్ష ఎంపీలు క‌లిసి వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. అంత‌కు ముందు ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు పార్ల‌మెంటు వ‌ద్ద స‌మావేశ‌మై కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఉభ‌య స‌భ‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై వారు చ‌ర్చించారు. మ‌రోవైపు, పెగాసస్‌పై సంబంధిత‌ అధికారులను స‌మాచార సాంకేతిక‌తకి చెందిన పార్లమెంటరీ ప్యానెల్‌ ప్రశ్నించనుంది. కేంద్ర ఐటీ, హోంశాఖకు చెందిన పలువురు అధికారులు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి : డాక్టర్ శృతికి మూడోసారి కరోనా పాజిటివ్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement