Monday, November 25, 2024

లఖింపూర్ ఖేరి ఘటన: రాష్ట్రపతిని కలవనున్న రాహుల్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్‌ ఖేరి ఘటనపై విపక్ష కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిసేందుకు సిద్ధమైయ్యారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల బృందం.. బుధవారం రాష్ట్రపతి రామ్ నాథ్ తో సమావేశం కానుంది. ఈ సందర్భంగా లఖింపూర్‌ ఖేరి హింస ఘటనపై ఫిర్యాదు చేయనుంది. ఏడుగురు సభ్యులు ప్రతినిధి బృందంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, కేసీ వేణుగోపాల్‌ రాష్ట్రపతిని కలవనుంది.

కాగా, ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్‌ ఖేరిలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారు రైతులపై దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందగా.. ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు చనిపోయారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాను పోలీసులు విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రాయచూర్ ను తెలంగాణలో కలిపేయాలి: బీజేపీ ఎమ్మెల్యే

Advertisement

తాజా వార్తలు

Advertisement