ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికిపంద చర్యని ధ్వజమెత్తారు. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో శక్తిహీనులకు ఇది ఒక ఆయుధంగా మారిపోయిందని ఆక్షేపించారు.
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై సోషల్ మీడియా వేదికగా దాడులు జరగడం, చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం అనాగరికి చర్య అంటూ ధ్వజమెత్తారు..ఈ సోషల్ మీడియాలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారిద్దరికీ కాంగ్రెస్ పార్టీతో పాటు తాను కూడా అండగా నిలబడతానని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.