భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కాంగ్రెస్ ‘భారత్ న్యాయ యాత్ర’ చేపట్టనుంది. జనవరి 14 నుంచి మార్చి 30వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్రను చేపట్టనున్నారు. 6,200 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది.
మణిపూర్ నుంచి ముంబై వరకు 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల్లో రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’ కొనసాగనుంది. ఈ విషయాన్ని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కాంగ్రెస్ ‘భారత్ న్యాయ యాత్ర’ చేపట్టనుంది. జనవరి 14 నుంచి మార్చి 30వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్రను చేపట్టనున్నారు. 6,200 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల్లో రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’ కొనసాగనుంది.
జనవరి 14వ తేదీన ఈ యాత్ర ప్రారంభం అయ్యి 14 రాష్ట్రాల గుండా.. 85 జిల్లాల్లో కొనసాగనుంది. మణిపూర్‌లో మొదలై.. ముంబై వరకు దాదాపు 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. మార్చి 20వ తేదీతో యాత్ర ముగుస్తుంది. అయితే ఈసారి యాత్రకు భారత్ జోడో యాత్ర అని కాకుండా.. భారత్ న్యాయయాత్ర అని పేరు పెట్టినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. రాహుల్ యాత్ర ఈసారి హైబ్రీడ్ మోడల్‌లో సాగనుంది. అంటే.. బస్సు ద్వారా, కాలి నడక ద్వారా రాహుల్ యాత్ర కొనసాగుతుందని కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారు. భారత్ జోడో యాత్ర ఇచ్చిన గొప్ప అనుభవంతో రాహుల్ భారత్ న్యాయయాత్ర చేయబోతున్నారు. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదు. ఈసారి యువతను, మహిళలను, అణగారిన వర్గాలతో రాహుల్ ముఖాముఖి అవుతారని వెల్లడించారు.