Monday, October 21, 2024

Leader of Opposition – లోక్ స‌భ విప‌క్ష నేత‌గా రాహుల్ గాంధీ…

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీని నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత ఎంపికపై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శనివారం సమావేశమమైంది. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోవాలని రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, అలప్పుజా నుంచి ఎంపీగా ఎన్నికైన కేసీ కెసి వేణుగోపాల్ తెలిపారు.

అలాగే ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. ‘రాహుల్ నడిపించిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర ఎంతో చురుకుగా సాగింది. ఈ రెండు యాత్రలకు ప్రజల్లో విశేష ఆదరణ లభించాయి. ఆయన ఆలోచన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు మన దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపులు, ఆశలను రేకెత్తించాయి. లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లపై కాంగ్రెస్‌పై విశ్వాసం కల్పించాయి. పంచన్యాయ్-పచ్చీస్ హామీ కార్యక్రమం ఎన్నికల ప్రచారంలో అత్యంత శక్తివంతంగా మారింది’ అని తెలిపింది

- Advertisement -

కాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విస్తృత సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement