రాజస్థాన్ లో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కాగా ఝులావార్లోని యాత్రలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ ఆఫీస్ దాటుతుండగా ఆ భవనంపై ఉన్న బీజేపీ కార్యకర్తలకు ..రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చారు. వారిని చూస్తూ గాల్లో ముద్దులు పెట్టారు. ఆ సమయంలో రాహుల్ గాంధీతోపాటు సీఎం అశోక్ గెహ్లట్, ఆర్‌పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోటస్రా, సచిన్ పైలట్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. అయితే బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజునే… ఈ విధంగా రాహుల్ గాంధీ ముద్దుల వర్షం కురిపించడం.. ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ ముద్దుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement