Wednesday, November 20, 2024

India | అదానీ ఇష్యూపై పార్లమెంట్​లో రాహుల్​ ఫైర్​.. మోదీ, అదానీ ఫ్రెండ్​షిప్​పై ఫొటోల ప్రదర్శన

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇవ్వాల (మంగళవారం) పార్లమెంటులో ప్రభుత్వంపై మండిపడ్డారు. అదానీ గ్రూప్ ఇష్యూ, అగ్నిపథ్ స్కీమ్‌ వంటి ఇష్యూస్​ని లేవనెత్తారు. US-కి చెందిన షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించిన నివేదిక తర్వాత అదానీ గ్రూప్ వివాదంలో చిక్కుకుంది. అయితే.. వ్యాపారవేత్త విమానంలో గౌతమ్ అదానీతో కలిసి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను చూపుతూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వ్యాపారవేత్త అదానీ, ప్రధాని మోదీ ఫ్రెండ్​షిప్​ని హైలైట్ చేస్తూ.. దేశంలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్​ ముఖ్యనేత, ఎంపీ రాహుల్​ గాంధీ పార్లమెంట్​లో దాడికి దిగారు. కొద్ది రోజులుగా షేర్​ మార్కెట్​లో జరుగుతున్న పరిణామలకు కారణం.. వ్యాపార వేత్త అదానీనే కారణమని, ఎంతో మంది తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో మోదీ, అదానీ సాన్నిహిత్యాన్ని రుజువు చేయడానికి రాహుల్​ గాంధీ ఓ ఫొటో చూపించిన విధానాన్ని స్పీకర్ ఓం బిర్లా తప్పుబట్టారు. రాహుల్ ఆరోపణలకుతగిన రుజువులుంటే చూపించాలని న్యాయ మంత్రి కిరణ్ రిజిజు అడిగారు.

అగ్నివీర్ పథకం ఆర్మీ నుంచి రాలేదని.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆర్మీపై ఒత్తిడి తెచ్చారని పదవీ విరమణ పొందిన అధికారులు తమ మనస్సులో ఉన్నారని రాహుల్ గాంధీ అగ్నివీర్ పథకంపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈరోజు లోక్‌సభలో రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి.

1. “తమిళనాడు, కేరళ నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు మేము ప్రతిచోటా ఒకే పేరు వింటున్నాము – ‘అదానీ’. దేశవ్యాప్తంగా ‘అదానీ’, ‘అదానీ’, ‘అదానీ’ మాత్రమే.. అదానీ ప్రవేశించిన ప్రతి వ్యాపారంలో ఎలా విజయం సాధించాడో అని ప్రజలు ఆశ్చర్యపోయారు”అని ఆయన అన్నారు.

- Advertisement -

2. “2014, 2022 మధ్యకాలంలో కేవలం $8 బిలియన్ల నుండి అదానీ నికర విలువ $140 బిలియన్లకు ఎలా చేరుకుందని ప్రజలు మమ్మల్ని అడిగారు. అదానీ ఇప్పుడు 8 నుండి 10 రంగాలలో నిమగ్నమై ఉన్నారు. అందరూ అదానీ గురించే మాట్లాడుతున్నారు. కాశ్మీర్, హిమాచల్‌లోని ఆపిల్‌ల నుండి ఓడరేవులు, విమానాశ్రయాలు, మనం నడుస్తున్న రోడ్ల వరకు కూడా.

3. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం సంబంధం ప్రారంభమైంది. ఒక వ్యక్తి నరేంద్ర మోదీతో భుజం భుజం కలిపి నిలబడి, ఆయనకు విధేయుడిగా ఉంటూ, ‘పునరుత్థాన గుజరాత్’ ఆలోచనను నిర్మించడంలో ఆయనకు సహాయం చేశాడు. 2014లో నరేంద్రమోడీ ఢిల్లీకి చేరుకోవడంతో అసలు మ్యాజిక్ మొదలైంది’’ అని రాహుల్​ అన్నారు.

4. అదానీకి సహాయం చేయడానికి రూల్స్ మార్చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. “విమానాశ్రయాల్లో ముందస్తు అనుభవం లేని ఎవరైనా వాటి అభివృద్ధిలో పాలుపంచుకోకూడదనే నియమం ఉంది. ఈ నిబంధనను భారత ప్రభుత్వం మార్చింది. అదానీకి ఆరు విమానాశ్రయాలను ఇచ్చింది. ఆ తర్వాత దేశంలో అత్యంత లాభదాయకమైన విమానాశ్రయం- ముంబై విమానాశ్రయం – సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి ఏజెన్సీలను ఉపయోగించి జీవీకే నుండి హైజాక్ చేసి, కేంద్రం అదానీకి ఇచ్చింది”అని ఆయన అన్నారు.

5. అదానీ రక్షణ ఒప్పందాలకు కేంద్రం సాయం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. “రక్షణ రంగంలో అదానీకి అనుభవం శూన్యం. నిన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో ప్రధాని మోదీ మాట్లాడుతూ మేము తప్పుడు ఆరోపణలు చేశామని అన్నారు. అయితే వాస్తవానికి 126 విమానాల కోసం హెచ్‌ఏఎల్ కాంట్రాక్ట్ అనిల్ అంబానీకి చేరింది. అదానీ ఎప్పుడూ డ్రోన్‌లను తయారు చేయలేదు. కానీ హెచ్‌ఏఎల్, ఇతర కంపెనీలు చేశాయి. అయినప్పటికీ, ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు వెళ్లి, అదానీ కాంట్రాక్ట్ ను పొందారు”అని రాహుల్​ విమర్శించారు.

6. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదానీకి బిలియన్ డాలర్ల రుణం ఇచ్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంతే కాదు, ప్రధాని బంగ్లాదేశ్ పర్యటన తర్వాత, బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ అదానీతో 25 ఏళ్ల ఒప్పందంపై సంతకం చేసిందని పేర్కొన్నారు.

7. “2022లో పవన విద్యుత్ ప్రాజెక్టును గౌతమ్ అదానీకి ఇవ్వాలని ప్రధాని మోదీ తనపై ఒత్తిడి తెచ్చారని అప్పటి అధ్యక్షుడు రాజ్‌పక్స తనకు చెప్పారని శ్రీలంక విద్యుత్ బోర్డు చైర్మన్ ఆ దేశ పార్లమెంటరీ కమిటీకి తెలియజేశారు. ఇది భారత విదేశాంగ విధానం కాదు. ఇది అదానీ వ్యాపారానికి సంబంధించిన విధానం’’ అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

8. “గతంలో PM మోదీ అదానీ యొక్క విమానంలో ప్రయాణించేవారు. ఇప్పుడు మోదీజీ విమానంలో అదానీ ప్రయాణిస్తున్నారు. ఇది ఇంతకుముందు గుజరాత్‌కు సంబంధించిన విషయం.. తర్వాత ఇది భారతదేశానికి సంబంధించిన అంశంగా మారింది. ఇప్పుడు అంతర్జాతీయంగా మారింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గత 20ఏళ్లలో అదానీ బీజేపీకి ఎంత డబ్బు ఇచ్చాడు? అని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.

9. రక్షణ సిబ్బంది నియామకానికి సంబంధించిన అగ్నివీర్ పథకాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సైన్యంలో చేరాలని ఆకాంక్షిస్తున్న యువకులు, మహిళలు ఈ పథకంపై ప్రభుత్వంతో సమానంగా లేరని పేర్కొన్నారు.

10. ఈ పథకం ఆర్‌ఎస్‌ఎస్, హోం మంత్రిత్వ శాఖ నుండి వచ్చిందని.. సైన్యం నుండి కాదని సీనియర్ అధికారులు చెప్పారు. ఈ పథకం సైన్యాన్ని బలహీనపరుస్తుందని అధికారులు చెప్పారని రాహుల్​ గాంధీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement