కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లలో దేశంలో ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. దేశంలో నలుగురు వ్యక్తులు నియంతల్లా వ్యవహరిస్తున్నారన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేేశారన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య, అగ్నిపథ్ పై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతోందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement