కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా పెద్దెత్తున మద్దతు లభిస్తుంది. ఏపీలో ఈ యాత్ర భారీగా ప్రజాదరణ పొందింది. తాజాగా భారత జోడో యాత్ర తెలంగాణలోకి నేడు ప్రవేశించింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలతో రాహుల్‌కు స్వాగతం పలికారు. మక్తల్ దగ్గర కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి రాహుల్ ప్రవేశించారు. కృష్ణా బ్రిడ్జి దగ్గర రాహుల్‌కి టీ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. బతుకమ్మ, బోనాలు, డోలు వాయిద్యాలతో.. తెలంగాణ సాంస్కృతిక కళా రూపాలతో రాహుల్‌కి ఘన స్వాగతం పలికారు. నేడు 3.9 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర సాగనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement